కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today) : కర్కాటక రాశి వారికి ఈరోజు గురుడు ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం మెరుగ్గా ఉంటుంది. శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మీ ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, తొందరపడకండి. ప్రశాంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.
పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి.



