డీజే సౌండ్కు ఇంటర్ విద్యార్థి మృతి
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతులకు కుమారుడు రవితేజ (17). స్నేహితుడి ఇంట్లో పెళ్లి ఉండటంతో రాత్రి అక్కడికి వెళ్లాడు.
స్నేహితుడి ఇంట్లో పెళ్లి సందడిలో డీజే సౌండ్కు డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలాడు.
స్నేహితులు, స్థానికులు అతడిని కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు.
డీజే సౌండ్ వల్ల ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ప్రభుత్వాలు డీజేలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నా.. డీజే లేకుండా ప్రజలు ఎలాంటి ఫంక్షన్లు చేసుకోవడం లేదు.
