నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి X (ట్విట్టర్) ద్వార హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.అని X (ట్విట్టర్) ద్వార జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


No Comment! Be the first one.